ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కలకలం.. 30 ఏళ్ల మహిళను కార్‌లో..

Woman Sexual Assault inside car in Delhi. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కలకలం మొదలైంది. పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్‌లో

By Medi Samrat
Published on : 30 Dec 2021 10:25 AM IST

ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కలకలం.. 30 ఏళ్ల మహిళను కార్‌లో..

దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కలకలం మొదలైంది. పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్‌లో సోమవారం తెల్లవారుజామున కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. సోమవారం హరి నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన కొన్ని గంటల తర్వాత ఢిల్లీలోని రన్‌హోలాలోని వారి ఇళ్ల నుంచి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, తెల్లవారుజామున 3 గంటలకు మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండడం గుర్తించి ఆ తర్వాత ఆమెను కారులోకి ఎక్కించుకున్నారు.

సోమవారం మూడు గంటల సమయంలో మహిళ తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాలని గుర్తు తెలియని వ్యక్తిని కోరింది. కారులో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. సాగర్‌పూర్ నుండి కారులో ఆ వ్యక్తితో పాటు మహిళ కూర్చుంది. నిహాల్ విహార్ ప్రాంతంలోని నిర్జన ప్రదేశంలో కారును ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుంటే.. ఢిల్లీలో ఏటా దాదాపు 1,500 అత్యాచార కేసులు నమోదవుతుండగా, అందులో 2% కంటే తక్కువ కేసులు ఇలాంటి కేటగిరీలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాదాపు 98% కేసులలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న రేపిస్టులు సాధారణంగా స్నేహితులు, పొరుగువారు, కుటుంబ సభ్యులు, భాగస్వాములేనని తెలుస్తోంది.


Next Story