కారును ఆపి.. భర్తకు తుపాకీ గురిపెట్టి.. భార్యను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం

Woman sexual assault during family outing in Madhya Pradesh. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళపై దుండుగులు

By అంజి  Published on  4 Jan 2022 10:44 AM GMT
కారును ఆపి.. భర్తకు తుపాకీ గురిపెట్టి.. భార్యను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళపై దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారని మంగళవారం పోలీసులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. తన భర్త, పిల్లలతో కలిసి కారులో బయలు దేరామని ఆ మహిళ పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత విహార యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. రఘోఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరోన్ రోడ్‌లో ఇద్దరు వ్యక్తులు కారును ఆపమని వారికి సంకేతాలు ఇచ్చారని పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ మిశ్రా తెలిపారు.

వారు కారును ఆపిన తర్వాత, వారిలో ఒకరు తన భర్తను తుపాకీతో పట్టుకోగా, మరొకరు ఆమెను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని అతను చెప్పాడు. ఫిర్యాదుదారు ప్రకారం, నిందితులు ఒకరినొకరు సోను, సుమేర్ అని సంబోధించారని అధికారి తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శోధన ప్రారంభించి, సోను యాదవ్ (32), సుమేర్ సింగ్ పర్మార్ (30) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story
Share it