పెంపుడు కుక్కకు 'సోను' అని పేరు.. మహిళపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన పొరుగింటి వారు

Woman set on fire by neighbour in Gujarat village over her puppy's name. మహిళ తాను ప్రేమగా పెంచుకుంటున్న కుక్కకు సోను అని పేరు పెట్టుకుంది. అయితే ఆ పేరే ఆమెకు శాపంగా మారింది.

By అంజి  Published on  22 Dec 2021 3:34 AM GMT
పెంపుడు కుక్కకు సోను అని పేరు.. మహిళపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన పొరుగింటి వారు

గుజరాత్‌లో ఓ మహిళ తాను ప్రేమగా పెంచుకుంటున్న కుక్కకు సోను అని పేరు పెట్టుకుంది. అయితే ఆ పేరే ఆమెకు శాపంగా మారింది. కుక్కకు ఆ పేరు ఎలా పెడతావంటూ కోపంతో ఆమెపై పొరుగింటి వారు నిప్పంటించారు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. అని మంగళవారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటన భావ్‌నగర్ జిల్లాలోని పలిటానా పట్టణంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితురాలు నీతాబెన్ సర్వయియా (35)కు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె భావ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పలిటానా టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఘటనా సమయంలో సర్వయియా తన చిన్న కొడుకుతో కలిసి ఇంట్లోనే ఉంది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లారని పోలీసులు తెలిపారు.

సర్వాయియా ఇంట్లోకి సోమవారం మధ్యాహ్నం సురభాయ్ భర్వాద్‌ అనే వ్యక్తితో పాటు మరో ఐదుగురు చొరబడ్డారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దాని ప్రకారం.. సర్వయియా తన కుక్కపిల్లకి సోను అని పేరు పెట్టుకుంది. అయితే భర్వాద్ భార్య ముద్దుపేరు "సోను". కాగా సోను అని పేరు పెట్టడాన్ని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వయియా ఉద్దేశపూర్వకంగా కుక్కపిల్లకి తన భార్య పేరు పెట్టారని భర్వాద్ ఆరోపించాడని పోలీసులు తెలిపారు. భర్వాద్ తనను దుర్భాషలాడాడని, అయితే అతడిని ఇతరులను తప్పించేందుకు ప్రయత్నించాడని సర్వయియా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఆమె వంటగదిలోకి రాగానే ముగ్గురు వ్యక్తులు ఆమెను అనుసరించారు. వారిలో ఒకరు సర్వయియాపై కంటైనర్‌లోని కిరోసిన్‌ పోసి అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటించారని పోలీసులు తెలిపారు.

సర్వాయియా గట్టిగా కేకలు పెట్టడంతో.. అది విని కొంతమంది ఇరుగుపొరుగు వారు ఆమె ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో ఆమె భర్త కూడా వచ్చాడు. వారు ఆమె భర్త కోటుతో మంటలను ఆర్పారు. మహిళకు తీవ్ర కాలిన గాయాలయ్యాయని అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీటి సరఫరా విషయంలో సర్వాయియా కుటుంబీకులు, ఆమెపై దాడి చేసిన వారి మధ్య గతంలో గొడవలు జరిగాయి. అయితే ఆ విషయం సామరస్యపూర్వకంగా పరిష్కరించబడింది. భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద హత్యాయత్నం, ఇళ్లలోకి చొరబడటం, అవమానించడం తదితర నేరాలకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

Next Story
Share it