మహిళా సర్పంచ్‌ దారుణ హత్య.. చెట్ల పొదల్లో నగ్నంగా మృతదేహం లభ్యం

Woman Sarpanch killed in Maharashtra. మహిళా సర్పంచ్‌ దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె వివస్త్రను చేసి పొదల్లో పడేశారు.

By అంజి  Published on  28 Dec 2021 8:54 AM GMT
మహిళా సర్పంచ్‌ దారుణ హత్య..  చెట్ల పొదల్లో నగ్నంగా మృతదేహం లభ్యం

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌ దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె వివస్త్రను చేసి సోమవారం మధ్యాహ్నం పొదల్లో పడేశారు. మహద్ తాలూకా బెలోషి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆమె మృతదేహాన్ని గమనించిన స్థానిక యువకుడు రోడ్డుపక్కన విసిరివేయబడిన గోనె సంచిని గమనించి దానిని తనిఖీ చేయడానికి ముందుకు సాగాడు. మహిళ మృతదేహం నగ్నంగా ఉందని, గాయాల గుర్తులను గుర్తించాడు. దీంతో అతను గ్రామస్థులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు.

మహిళ స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. పోలీసులు గుర్తు తెలియని నిందితులపై హత్య కేసు నమోదు చేశారు. మహిళపై లైంగిక వేధింపులకు గురైందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం నివేదికను అందజేశారని చెప్పారు. వైద్య నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో ఇతర అభియోగాలు జోడించబడతాయి. మృతులకు సంబంధించిన వారి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు.

Next Story
Share it