ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసింది ఓ యువతి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల విసర్జీత్ అనే వ్యక్తికి, ఢిల్లీలో ఉంటున్న అమీనా ఖాతూన్ అనే యువతితో గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఢిల్లీ వచ్చిన విసర్జీత్, అమీనాతో పాటే ఆమె ఇంట్లో ఉన్నాడు. విసర్జీత్‌కు వేరొకరితో వివాహం జరిగిందని, ఆ విషయాన్ని అతను తన దగ్గర దాచిపెట్టాడని అమీనాకు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె అతడిపై పగ పెంచుకుంది. రాత్రి సమయంలో అతడు తాగే పాలలో మత్తుమందు కలిపి ఇచ్చింది. రాత్రి రెండున్నర గంటల సమయంలో అతడు మత్తులో ఉండగా.. ఒక పదునైన ఆయుధంతో అతడి మర్మాంగాన్ని దారుణంగా కోసేసింది. ఆ తర్వాత నొప్పితో విలవిలలాడుతూ ఆ యువకుడు అర్ధరాత్రి ఎలాగోలా ఒంటరిగా ఆస్పత్రికి చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. బాధితుడి వాంగ్మూలం ఆధారంగా అమీనా ఖాతూన్‌పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు.