అర్థరాత్రి పత్తి చేనులో భర్తను చంపిన భార్య.. దానికి అడ్డు వస్తున్నాడని..

Woman kills husband with the help of lover. రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో ఓ భర్తను తన ప్రియుడితో

By అంజి  Published on  6 Nov 2021 5:51 PM IST
అర్థరాత్రి పత్తి చేనులో భర్తను చంపిన భార్య.. దానికి అడ్డు వస్తున్నాడని..

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో ఓ భర్తను తన ప్రియుడితో కలిసి భార్య అతి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన చన్గోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎరుకల వెంకటయ్య (30), మాధవి (26) ఇద్దరూ భార్య భర్తలు. వీరు అదే గ్రామంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అదే గ్రామానికి శేఖర్‌ అనే వ్యక్తితో మాధవి వివాహేతర సంబంధం నడుపుతోంది. ఇదే విషయమై భార్య మాధవిని పలుమార్లు భర్త వెంకటయ్య హెచ్చరించాడు.

అయినా మాధవి తీరు మార్చుకోలేదు. పైగా భర్తపై కోపం పెంచుకున్న మాధవి.. ఎలాగైన అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న వెంకటయ్యను హతమార్చేందుకు మాధవి, శేఖర్‌లు కలిసి పథకం పన్నారు. ప్లాన్‌లో భాగంగా గురువారం రాత్రి గ్రామ శివారులో ఉన్న పతి చేనులోకి వెంటయ్యను తీసుకెళ్లి చంపేశారు. శుక్రవారం నాడు వెంకటయ్య కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story