అలా భర్త షర్ట్‌ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య.!

Woman hangs death after argument husband over new shirt. భార్యభర్తల మధ్య చిన్న చిన్న విషయాలే.. గొడవలకు దారితీస్తాయి. ఆ గొడవలే చిలికి చిలికి గాలి వానలా మారి వివాహం

By అంజి  Published on  21 Oct 2021 10:26 AM GMT
అలా భర్త షర్ట్‌ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య.!

భార్యభర్తల మధ్య చిన్న చిన్న విషయాలే.. గొడవలకు దారితీస్తాయి. ఆ గొడవలే చిలికి చిలికి గాలి వానలా మారి వివాహం బంధం విడిపోయేలా చేస్తాయి. తాజాగా ఇలాంటి ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఆర్‌కేపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. తనకు నచ్చినట్లు భర్త షర్ట్‌ కుట్టించుకోలేది భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన అంజలి సుమన్‌ అనే మహిళకు రాజస్తాన్‌కు చెందిన శుభం అనే వ్యక్తితో రెండేళ్ల కిందట పెళ్లి జరిగింది. మొదట్లో ఇద్దరు బాగానే కలిసి ఉండేవారు. ఇటీవల ఇద్దరి మధ్య ఓ షర్ట్‌ విషయంలో గొడవైంది. ''నాకు నచ్చినట్టు షర్ట్‌ ఎందుకు కుట్టించుకోలేదని'' భర్తతో భార్య గొడవపడింది.

గొడవ పెద్దది కావడంతో భర్త శుభం కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. బయటకెళ్లిన భర్తకు భార్య అంజలి ఫోన్‌ చేసింది. ఇంటికి వచ్చాక మాట్లాడదం అంటూ భర్త చెప్పాడు. కాసేపటి తర్వాత అంజలి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త శుభంకు ఫోన్‌ వచ్చింది. ఈ ఘటనపై భార్య అంజలి బంధువులు భర్త శుభంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య అంజలి ఇంత చిన్న విషయానికి ప్రాణాలు తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Next Story
Share it