యూపీలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చిన రోజురోజుకు మహిళలపై మృగాళ్ల ఆగాడాలు కట్టడి అవట్లేదు. తాజాగా.. సాయమడిగి ప్రాణం మీదకు తెచ్చుకుంది ఓ మహిళ. సాయం చేస్తున్నట్టే నమ్మించి మహిళపై తండ్రీ, కొడుకులు కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించి పారిపోయారు.
వివరాళ్లోకెళితే.. ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని మిశ్రిక్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ.. తన అత్తిల్లు సిధౌలి నుంచి మిశ్రిక్ వెళ్తుంది. ఈ క్రమంలోనే దారి మధ్యలో కార్ట్ ఫుల్లర్‌పై వెళ్తున్న తండ్రీ, కొడుకులను లిఫ్ట్ అడిగింది. ఆమెను బండి ఎక్కించుకున్న వారు నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెకు నిప్పంటించారు.
తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సీతాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.