మహిళపై సామూహిక అత్యాచారం

Woman gang-raped, dumped naked on road in Maharashtra. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం

By Medi Samrat  Published on  6 Aug 2022 3:45 PM GMT
మహిళపై సామూహిక అత్యాచారం

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి నగ్నంగా రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా, ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఒక వంతెన వద్ద వివస్త్రగా పడి ఉన్న మహిళ గురించి సమాచారం అందుకున్నారు పోలీసులు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను చికిత్స కోసం నాగ్‌పూర్ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఆమె స్టేట్‌మెంట్‌ ను పోలీసులు రికార్డ్ చేశారు.

జూలై 30న బాధితురాలు అత్త ఇంట్లో గొడవపడి కమర్‌గావ్ గ్రామంలోని తన సోదరుడి ఇంటికి వెళ్ళింది. ఆమె నిందితుల్లో ఒకరైన శ్రీరామ్ ఉర్కుడేను కలిసిందని పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు. శ్రీరామ్ ఆమె సోదరుడి ఇంటికి తీసుకెళ్తానని మొదట హామీ ఇచ్చాడు, కానీ ఆమెను పలాస్‌గావ్‌కు తీసుకెళ్లి, అత్యాచారం చేసి.. జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీప్రాంతం సమీపంలో వదిలివేశాడు. ఆగస్టు 1న, ఆమె భండారా జిల్లాలోని కన్హల్మోహ్‌కు చేరుకుంది.. అక్కడ రెండవ నిందితుడు లుక్కా అశోక్ సుర్వే ఆమెపై అత్యాచారం చేశాడు. సుర్వేకు మూడో నిందితుడు మహ్మద్ ఎజాజ్ మహ్మద్ అనాస్రీ సహాయం చేశాడని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులు సర్వే, అన్సారీలను అరెస్టు చేసి మరో నిందితుడు ఉర్కుడే కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసును గోరెగావ్ పోలీసులకు అప్పగించారు. తదుపరి విచారణ జరుపుతున్నారు.


Next Story
Share it