నవ దంపతుల జీవితంలో ఊహించని విషాదం

Woman died on the spot after being hit by an unknown vehicle in bengaluru. సినిమా చూసి ఇంటికి వెళుతున్న నవ దంపతుల జీవితంలో ఊహించని విషాదం

By Medi Samrat
Published on : 21 Aug 2022 6:13 PM IST

నవ దంపతుల జీవితంలో ఊహించని విషాదం

సినిమా చూసి ఇంటికి వెళుతున్న నవ దంపతుల జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. హోండా యాక్టివాను లారీ ఢీకొట్టడంతో బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ మృతి చెందగా, ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన యువతిని శ్వేత (23)గా గుర్తించగా, ఆమె భర్త ఆనంద్ (28) పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బెంగళూరు నగరంలోని కళ్యాణ్ నగర్ జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది.

కొత్తగా పెళ్లయిన ఈ జంట అర్థరాత్రి సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా యాక్టివా బైక్ ను లారీ ఢీకొట్టడంతో బైక్ వెనుక కూర్చున్న శ్వేత అక్కడికక్కడే మృతి చెందింది. శ్వేత మృతదేహాన్ని అంబేద్కర్ ఆసుపత్రికి పంపగా, ఆనంద్ హెచ్‌బిఆర్ మెయిన్ రోడ్ సమీపంలోని అల్టియస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బానసవాడి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


Next Story