ఆస్పత్రిలో యువతి మృతి.. బయటపడ్డ ఇద్దరు నర్సుల ఘనకార్యం.. యువతిని ఏం చేశారంటే
Woman dead after pregnancy abortion in rajasthan. అధిక రక్త స్రావంతో బాధపడుతున్న ఓ యువతిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు ఓ యువకుడు. అయితే ఆ యువతి
By అంజి Published on 21 Dec 2021 2:36 PM ISTరాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో అధిక రక్త స్రావంతో బాధపడుతున్న ఓ యువతిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు ఓ యువకుడు. అయితే ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇదే విషయమై ఆస్పత్రి సిబ్బంది.. యువతిని ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడిని సంప్రందించారు. దీనికి అతడు.. మృతురాలితో తనకు ఎలాంటి రిలేషన్ లేదని, రోడ్డుపై పడి ఉంటే ఆస్పత్రికి తీసుకొచ్చానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. యువతి అనాథ మృతదేహాంగా మారడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో నమ్మలేని నిజాలు తెలిశాయి.
హనుమాన్‌గఢ్ జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి నివసిస్తూ ఉండేది.. అదే గ్రామానికి చెందిన అంకిత్ కుమార్ అనే యువకుడితో యువతికి పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల పరిచయం వారిని మరింత దగ్గరగా చేసింది. దీంతో యువతి గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే అంకిత్ కుమార్.. యువతిని మమతా అనే ఓ నర్సు దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ నర్సు మమత మరో నర్సు కవిత సహాయంతో యువతికి అబార్షన్ చేసి పిండాన్ని తొలగించారు. ఇందుకు వారు రూ.30 వేల డబ్బులు తీసుకున్నారు. ఆపరేషన్ తర్వాత యువతికి అధిక రక్తస్రావం కావడం ప్రారంభమైంది.
దీంతో భయపడుతూ యువతిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని నర్సులు అంకిత్ కుమార్‌కు సూచించారు. దీంతో అంకిత్ కుమార్.. ఆ యువతిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ యువతి చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆస్పత్రి సిబ్బంది యువతిని తీసుకువచ్చిన యువకుడిని సంప్రదించగా.. అతడు పొంతన లేకుండా సమాధానం చెప్పాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంకిత్ కుమార్‌ను పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయం చెప్పడంతో ఇద్దరు నర్సులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.