విషాదం.. బావిలో దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
Woman commits suicide along 2 kids. కడప జిల్లాలో చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా తల్లి బావిలో
By అంజి Published on 30 Oct 2021 11:44 AM GMT
- చిన్నమండెం మండలం మల్లూరులో విషాదం
- బావిలో దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
- బావిలో నుంచి 3 మృతదేహాలు వెలికితీసిన స్థానికులు
కడప జిల్లాలో చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. మల్లూరు గ్రామంలోని దిగుడు బావిలో ఇద్దరు కుమారులను తోసేసిన, అనంతరం తల్లి కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ముగ్గురి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాయచోటిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల కలబురిగి జిల్లాలో ముగ్గురు కుమార్తెలతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, తల్లి చనిపోయారు. ఈశ్వరి (3) అనే బాలిక ప్రాణాలతో బయటపడింది. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని భర్త వేధింపులో భార్య ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ముంబర్గా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.