ఏడాది వయసున్న కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత

Woman Commit Suicide With Daughter. ఏడాది వయసు ఉన్న కూతురితో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

By Medi Samrat
Published on : 22 Oct 2022 8:15 PM IST

ఏడాది వయసున్న కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత
ఏడాది వయసు ఉన్న కూతురితో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. వివాహిత అంబిక(23), కూతురు నక్షత్ర(ఏడాది)తో కలిసి బావిలోకి దూకేసింది. ఆమె కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుందని భావిస్తూ ఉన్నారు. కుటుంబంలో ఇటీవలి కాలంలో గొడవలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు బావిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story