సహజీవనం చేస్తూనే.. చంపేసింది.. ఏం జరిగిందంటే..
Woman breaks her partner's head. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఓ మహిళ తనతో రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి తలపై
By Medi Samrat Published on 19 Dec 2021 2:14 PM GMTరాజస్థాన్‌లోని అల్వార్‌లో ఓ మహిళ తనతో రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి తలపై కర్రతో కొట్టి గాయపరిచింది. తలకు తీవ్రగాయాలైన ఆ వ్యక్తిని ఆమె ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. అయితే వైద్యులు ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆ యువకుడు చనిపోగా.. ఆ యువతి దాదాపు 5 నెలల పాటూ తప్పించుకుని తిరుగుతూ ఉంది. ఆ యువతి తన భాగస్వామితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించేది. కానీ ఓ రోజు గొడవ కారణంగా ఆమె తన భాగస్వామిపై దాడి చేసింది. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలు అవ్వడంతో ప్రాణాలు పోయాయి. ఈ కేసు అల్వార్ శివాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగరంలోని బుద్ విహార్ కాలనీలో పూనమ్ జాతవ్ అనే మహిళ కరణ్ సింగ్ అనే వ్యక్తితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది.
జూన్ 25న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పూనమ్ కరణ్ తలపై గట్టిగా కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆ మహిళ కరణ్ తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కరణ్‌ని హాస్పిటల్‌లో చేర్పించమని తండ్రి చెప్పాడు. అంతేకాకుండా కరణ్ తండ్రి తన పెద్ద కొడుకు దీపక్‌ను కూడా ఆసుపత్రికి పంపించాడు. కరణ్ అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆ మహిళ అక్కడి నుండి పారిపోయింది. ఆ తర్వాత కరణ్ చనిపోయాడు. పూనమ్‌పై కరణ్ కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు 5 నెలల తర్వాత NEB పోలీస్ స్టేషన్ పరిధిలో పూనమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కొన్ని నెలలుగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఆ మహిళ తన స్నేహితులతో తిరుగుతూ తప్పించుకుని తిరుగుతూ ఉండేదని పోలీసులు తెలిపారు. ఇన్‌ఫార్మర్‌ల సమాచారం మేరకు ఆమెను అరెస్టు చేశారు. ప్రియుడి హత్య కేసులో పూనమ్‌ను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. పూనమ్‌కి చాలా ఏళ్ల క్రితమే పెళ్లయిందని పోలీసులు తెలిపారు. అయితే పెళ్లయిన రెండు నెలలకే విడాకులు తీసుకుంది. దీని తరువాత, ఆమె చాలా సంవత్సరాలు కరణ్‌తో లివ్-ఇన్‌లో నివసిస్తోంది.