హన్మకొండ నగరంలో భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భర్త వేధింపులు తట్టుకోలేక పోయిన.. భార్య భర్తను దారుణంగా హతమార్చింది. వివరాల్లోకి వేళ్తే.. హన్మకొండలోని రెడ్డీ కాలనీలో దంపతులు గన్నేర్ల సుజాత, శంకర్‌లు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భర్త రోజు తాగి వచ్చి వేధింపులకు గురి చేయడాన్ని భర్త సుజాత్‌ తట్టుకోలేకపోయింది. రోజు తాగి భర్త టార్చర్‌ చేస్తుండటంతో అతడి పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో హైదరాబాద్‌లో ఉన్న తన సోదరుడిని రెడ్డి కాలనీకి పిలిపించుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి భర్త శంకర్‌ను హత్య చేశారు.

ఇనుప రాడ్‌తో కొట్టి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. భర్త వేధింపులు తట్టుకోలేకే హత్య చేశానని భార్య సుజాత పోలీసులకు తెలిపింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తను హత్య చేసిన గన్నేర్ల సుజాత (37) ఓ హోటల్‌లో పని చేస్తుండగా, సుజాత సోదరుడు వెంకటరమణ (24) ప్రైవేట్‌ ఉద్యోగి అని తెలిసింది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story