జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో ఓ వివాహిత తన భర్తతో కలిసి వెళ్లేందుకు నిరాకరించింది. నిజానికి ఆ మహిళ గత కొన్ని రోజులుగా భర్త, అత్తమామలు లేకపోవడంతో ప్రియుడితో కలిసి ఉంటోంది. అనుమానంతో గ్రామస్థులు మహిళను పట్టుకున్నారు. పలాము జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోయిండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ భర్త కూలి నిమిత్తం బయటకు వెళ్లాడు. అదే సమయంలో గత కొన్ని రోజులుగా ఆమె అత్తమామలు ఇంట్లో లేరు. ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న టిల్డాగ్‌లోని ఇటుక బట్టీలో వారు పనికి వెళ్లారు.
దీంతో భార్య ప్రియుడితో కలిసి ఉంటోంది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో భార్యను తన వద్ద ఉంచుకోవడానికి నిరాకరించాడు. ఈ విషయమై శుక్రవారం గ్రామస్థులు సమావేశమయ్యారు. మహిళ ప్రియుడి ఇంట్లో ఉండాల్సిందిగా గ్రామస్థులు నిర్ణయించారు. ఆమెతో పాటు చిన్న కూతురు కూడా వారిద్దరితో ఉంటుందని తీర్మానించారు. గోయిండి చెందిన ఆ యువకుడికి 2017 సంవత్సరంలో వివాహం జరిగింది. అతడు పని నిమిత్తం దూరప్రాంతంలో నివసించాల్సి వస్తుంది. దీంతో గత రెండేళ్లుగా అతని భార్య బనాయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు గ్రామంలో వాతావరణం చక్కగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.