భర్త లైఫ్ ను అలా డిసైడ్ చేసిన వైఫ్
Wife Kills Husband In Tamil Nadu. భార్యాభర్తల బంధంలో దాపరికాలు ఉండకూడదని అంటారు. కొన్ని చెబితే అర్థం
By Medi Samrat Published on 4 Oct 2021 3:06 PM ISTభార్యాభర్తల బంధంలో దాపరికాలు ఉండకూడదని అంటారు. కొన్ని చెబితే అర్థం చేసుకుంటారు.. ఇంకొన్ని వివరిస్తే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంతో జీవితాన్ని ఎండ్ చేయాలని ఫిక్స్ అయింది. అనుకున్నట్లుగా పెళ్ళైన మూడంటే మూడు నెలలకు భర్తను చంపేసింది. తమిళనాడు రాష్ట్రం పుదుక్కోట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహమైన మూడు నెలల్లోనే కట్టుకున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసింది.
గాంధర్వకోట ప్రాంతానికి చెందిన పాండిదురై (30) అనే వ్యక్తికి మూడు నెలల క్రితం నందిని (30)తో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీ నుండి పాండిదరై కనిపించకుండా పోయాడు. దీనిపై పాండిదురై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులు షాకయ్యే విషయాన్ని నందిని బయటపెట్టింది. తమ మధ్య గొడవ జరిగిందని.. ఆ సమయంలో తాను కోపంతో కత్తితో దాడి చేయడంతో పాండిదురై చనిపోయాడని నందిని తెలిపింది. మృతదేహాన్ని ఎవరూ లేని సమయంలో ఈడ్చుకెళ్ళి పాడుబడిన బావిలో పడేసినట్టు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేశారు.