Hyderabad : భర్తను హ‌త్య చేసిన భార్య‌

మియాపూర్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య తాళి కట్టిన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది

By Medi Samrat  Published on  21 Aug 2024 7:10 PM IST
Hyderabad : భర్తను హ‌త్య చేసిన భార్య‌

మియాపూర్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య తాళి కట్టిన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అస్సాంకు చెందిన రుక్సానా(35) అనే యువతి తన భర్తతో కలిసి జీవనోపాధి నిమిత్తం హైదరాబాదు నగరానికి వచ్చి హఫీజ్ పేట్‌లోని ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటూ రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రుక్సానా భర్త మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య‌, పిల్లలను కొట్టేవాడు. బుధవారం కూడా పుల్లుగా మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి వచ్చి పిల్లలపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అది గమనించిన రుక్సానా ప్రతిఘటించింది. ఇద్దరి మధ్య తోపులాట జరిగి రుక్సానా తన భర్తను గట్టిగా తోసేయడంతో అతని తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మియాపూర్ పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ మార్చరికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story