ఆస్తుల కోసం హత్య చేశారు.. పోస్టుమార్టం చేయండంటూ ఫోరెన్సిక్ విభాగానికి పోలీసులు లేఖ

Wife alleges in-laws role in husband's death. అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతిచెందాడ‌నే భార్య ఫిర్యాదు మేర‌కు ఓ మృతదేహానికి పోస్టుమార్టం

By Medi Samrat  Published on  6 May 2022 9:14 AM
ఆస్తుల కోసం హత్య చేశారు.. పోస్టుమార్టం చేయండంటూ ఫోరెన్సిక్ విభాగానికి పోలీసులు లేఖ

అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతిచెందాడ‌నే భార్య ఫిర్యాదు మేర‌కు ఓ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని అనంతపురం పోలీసులు నిర్ణయించారు. త్రీ టౌన్ సీఐ హరినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన మహబూబ్ పీరా(46) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ఆశా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహబూబ్ పీరా పదేళ్లుగా భార్యకు దూరంగా చెల్లెలి ద‌గ్గ‌ర‌ ఉంటున్నాడు. గత నెల 22న వాంతులు చేసుకోవడంతో మహబూబ్‌ పీరా ఈఎన్‌ఓ తాగాడు. అయితే కాసేపటికి కోమాలోకి వెళ్లడంతో అత‌డిని కుటుంబీకులు జీజీహెచ్‌కు తరలించారు.

ప‌రీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇందిరానగర్ సమీపంలోని ముస్లిం శ్మశానవాటికలో ఖననం చేశారు. భర్త మృతిపై భార్య ఆశా అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల తన భర్త వద్ద ఉన్న‌ రూ. 30 లక్షల నగదు, కార్లు, ఇతర ఆస్తుల కోసం అతడిని కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మహబూబ్ పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని త్రీ టౌన్ పోలీసులు ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగానికి లేఖ రాశారు. రెండు రోజుల్లో మహబూబ్ పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.










Next Story