ఫ్రిజ్‌లో మృత‌దేహం.. మరో యువ‌తిని ఇంటికి పిలిచి..

While Shraddha was still in the fridge, Aaftab invited another woman home. ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన లైవ్-ఇన్ రిలేష‌న్‌ భాగస్వామి శ్రద్ధను చంపిన కొద్ది రోజుల‌ తర్వాత

By Medi Samrat  Published on  15 Nov 2022 9:12 AM GMT
ఫ్రిజ్‌లో మృత‌దేహం.. మరో యువ‌తిని ఇంటికి పిలిచి..

ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన లైవ్-ఇన్ రిలేష‌న్‌ భాగస్వామి శ్రద్ధను చంపిన కొద్ది రోజుల‌ తర్వాత డేటింగ్ అప్లికేషన్ ద్వారా తన ఇంటికి మరొక అమ్మాయిని ఆహ్వానించినట్లుతెలుస్తోంది. యువ‌తిని రావాడానికి ముందు అఫ్తాబ్.. శ్రద్ధ శరీర భాగాలను అల్మారా, రిఫ్రిజిరేటర్‌లో దాచాడు. నిందితుడు ఫోరెన్సిక్ విచారణలో DNA నమూనా నుండి తప్పించుకోవడానికి.. రక్తపు మరకలను తొలగించడానికి సల్ఫర్ హైపోకలోరిక్ యాసిడ్‌ను ఉపయోగించాడు. ఈ విష‌యాన్ని నిందితుడు ఇంటర్నెట్‌లో వెతికి తెలుసుకున్నాడు.

కొత్తగా కొనుగోలు చేసిన 300-లీటర్ రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి ముందు ఆఫ్తాబ్ శ్రద్ధను గొంతు కోసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత 16 రోజుల పాటు ఆమె శరీర భాగాలను ఢిల్లీ అటవీ ప్రాంతంలో విసిరేశాడు. శ్రద్ధను హత్య చేసింది తానేనని అఫ్తాబ్ పోలీసుల ముందు అంగీకరించాడు. ఇదిలా ఉండగా.. అఫ్తాబ్ అసభ్యంగా ప్రవర్తించాడని, శ్రద్ధపై దాడి చేస్తాడని శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఐదు నెలల క్రితం మే నెలలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ హత్య జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు నవంబర్ 8న మెహ్రౌలీ పోలీసులకు తప్పిపోవడంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అధికారులు తెలిపిన ప్రకారం.. బాధితురాలు ముంబైలో మలాడ్ ప్రాంతంలోని కాల్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఆమెకు ఆఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. బాధితురాలు కాలక్రమేణా అఫ్తాబ్‌తో సన్నిహితంగా మెలిగింది. డేటింగ్‌లో కొన్ని నెలలు, ఈ జంట ఢిల్లీకి వెళ్లి సహజీవనం చేయడం ప్రారంభించారు. బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే తమ కుమార్తె లివ్-ఇన్ రిలేషన్‌షిప్ గురించి తెలుసుకుని, ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు.

మరోవైపు శ్రద్ధ.. అఫ్తాబ్ తనను వివాహం చేసుకుంటాడనే ఆలోచనలో ఉంది. పెళ్లి చేసుకుని కలిసి ఉందామని ఆఫ్తాబ్‌ను ఒత్తిడి చేసింది. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవ‌లు జ‌రిగేవి. ఈ క్రమంలోనే గొడవ సమయంలో శ్రద్ధ బిగ్గరగా అరవడంతో.. ఆమెను నిశ్శబద్దంగా ఉంచడానికి గొంతును నొక్కాడు. దీంతో ఊపిరాడక శ్రద్ధ మృతి చెందింది. అఫ్తాబ్‌ తాను చేసిన నేరాన్ని దాచడానికి, ఒక రంపాన్ని ఉపయోగించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, వాటిని 16 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారవేసాడు.


Next Story