ఓ ఇంట్లో చోరీ చేసిన చీరను కట్టుకుని తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకుంది ఓ మహిళా దొంగ. ఆ వాట్సప్ స్టేటస్ చూసిన భాదితురాలు.. అది తన చీరనే అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సదరు మహిళా దొంగను కటాకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
తాడేపల్లిలోని డోలాస్‌నగర్‌లో ప్రైమ్ గెలాక్సీ అపార్టుమెంట్‌లో విట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కత్తి అయోగ్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది జూన్ లో కర్ణాకటలో ఉంటున్న తన తల్లిందండ్రుల వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో చోరీ జరిగింది. 45 గ్రాముల బంగారం, ఖరీదైన చీరలు చోరికి గురయ్యాయి. అక్టోబర్ 29 న ఇంటికి చేరుకున్న ప్రొపెసర్ తన ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే.. సదరు అపార్టుమెంట్‌లో గతంలో పనిచేసిన సునీత తమ ఇంటిలో చోరీ అయిన చీరను కట్టుకుని వాటాప్స్ స్టేటస్ పెట్టుకుంది. గమనించిన అసిస్టెంట్ ప్రొపెసర్ ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని లక్షా ఎనభై వేల రూపాయల ఖరీదైన బంగారం, చీరలు స్వాధీనం చేసుకున్నారు.