ఫిల్మ్ సిటీలో ఎన్ కౌంటర్
Wanted criminal arrested after shootout in Noida Film City. నోయిడా ఫిల్మ్ సిటీలో ఎన్ కౌంటర్ జరిగింది. సెక్టార్ 20 పోలీసులు అనేక కేసుల్లో వాంటెడ్ నేరస్థుడిని
By Medi Samrat Published on 7 Oct 2022 1:17 PM ISTనోయిడా ఫిల్మ్ సిటీలో ఎన్ కౌంటర్ జరిగింది. సెక్టార్ 20 పోలీసులు అనేక కేసుల్లో వాంటెడ్ నేరస్థుడిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడిని ఢిల్లీలోని మయూర్‌విహార్‌లో నివాసం ఉంటున్న డానిష్ (27) అలియాస్ సాయర్ అలియాస్ చీతాగా గుర్తించారు. ఇతడు చేను గ్యాంగ్‌లో షూటర్‌గా ఉన్నాడు. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా), అశుతోష్ ద్వివేది మాట్లాడుతూ, "ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని వివిధ పోలీసు స్టేషన్లలో డానిష్‌పై 20కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి." అని తెలిపారు. "శుక్రవారం ఉదయం బ్రహ్మపుత్ర మార్కెట్ సమీపంలో పోలీసులు నాకాబందీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో డానిష్ ను అడ్డుకున్నారు. పోలీసులను చూడగానే అతను అక్కడి నుండి పారిపోయాడు. సమీపంలోని పోలీసులు అప్రమత్తమయ్యాయి" అని ద్వివేది చెప్పారు.
పలు పోస్టుల బృందాలు అతనిని వెంబడించాయి. అతడు సెక్టార్ 16Aలోని ఫిల్మ్ సిటీ లోకి వెళ్ళిపోయాడు. అక్కడ పవర్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. డానిష్ తప్పించుకోవడానికి పోలీసు బృందాలపై కాల్పులు జరిపాడు, కానీ పోలీసుల ఫైరింగ్ లో అతను గాయపడ్డాడు. అతని వద్ద నుంచి మోటార్ సైకిల్, తుపాకీ, రెండు కాట్రిడ్జ్‌లు, నాలుగు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలికి బుల్లెట్ తగలడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై రెండు డజన్లకు పైగా దోపిడీ, ఇతర నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. "అతనితో ఉన్న అతని సహచరుడిని ట్రాక్ చేయడానికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు, కానీ తప్పించుకున్నాడు. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం" అని అధికారి తెలిపారు.