కారులో అక్కపై సామూహిక అత్యాచారం.. చెల్లిని కూడా..

Waitress gang raped in car. ఓ 26 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది.

By అంజి  Published on  20 Oct 2021 5:28 PM IST
కారులో అక్కపై సామూహిక అత్యాచారం.. చెల్లిని కూడా..

ఓ 26 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బార్‌లో లేడీస్‌ ఆర్కెస్ట్రాలో ఓ 26 ఏళ్ల మహిళ వెయిట్రెస్‌గా పని చేస్తోంది. తనతో పని చేసే గోవింద్‌ రాజ్‌భర్‌ అనే వ్యక్తితో గత కొంత కాలంగా మహిళ సన్నిహితంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ బాధితురాలిపై రాజ్‌భర్‌ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నల్లసపొర ఏరియాకు చెందిన రాజ్‌భర్‌ 2019 ఫిబ్రవరి నుంచి 2021 ఆగస్టు వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించాడని బాధితురాలు ఆరోపించింది.

ఇళ్లు కొనుగోలు చేస్తున్నానంటూ తన దగ్గరి నుంచి ఆభరణాలు, నగదును పెద్దమొత్తంలో తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. చెన్న బ్రిడ్జి సమీపంలో బాధితురాలిని కారులో ఎక్కించి రాజ్‌భర్‌, అతని ముగ్గురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను కాసర్వాడవులీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి సోదరి స్నానం చేస్తుండగా నిందితుడు రాజ్‌భర్ అసభ్యకరమైన వీడియోను రికార్డ్ చేసి, ఆమెను కూడా బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నగర పోలీసులు తెలిపారు. ఒక మహిళా అధికారి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story