మద్యం మత్తులో తన అభిమాన క్రికెటర్‌ను అవమానించినందుకు ఓ వ్యక్తి అతని స్నేహితుడి దారుణంగా హత్య చేశాడు. అవమానించాడని కోపోద్రిక్తుడైన విరాట్ కోహ్లి అభిమాని.. రోహిత్ శర్మ అభిమానిని మద్యం బాటిల్‌తో తలపై, తర్వాత క్రికెట్ బ్యాట్‌తో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్ శర్మ అభిమాని విఘ్నేష్, అలాగే విరాట్ కోహ్లీ డై హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ఎస్. ధర్మ రాజు అరియల్లూరు జిల్లా మల్లూరు సమీపంలోని సిడ్కో పారిశ్రామిక ఎస్టేట్‌లో మద్యం తాగి క్రికెట్ గురించి చర్చిస్తున్నారు.
విఘ్నేష్ మద్యం మత్తులో విరాట్‌కోహ్లీ గురించి తప్పుగా మాట్లాడుతూ ధర్మరాజ్‌ని ఎగతాళి చేశాడు. అతను తర్వాత బాడీ-షేమ్ గురించి కూడా కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విఘ్నేష్.. విరాట్ కోహ్లీని, అతని ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎగతాళి చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన ధరమ్‌రాజ్ మద్యం బాటిల్, క్రికెట్ బ్యాట్‌తో విఘ్నేష్‌ను కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. విఘ్నేష్ మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో కొంతమంది కార్మికులు గుర్తించారు.
అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మరాజ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. విఘ్నేష్ ఐటీఐ అర్హత సాధించిన యువకుడని, సింగపూర్ నుంచి వర్క్ పర్మిట్ కోసం ఎదురుచూస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన అక్టోబర్ 11న జరిగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.