విస్ట్రాన్ కంపెనీ ప్లాంట్‌లో ఉద్యోగుల విధ్వంసం
Violence reported by iPhone Corporation to iPhone manufacturing plant in Karnataka. కర్నాటకలోని కోలార్‌లో ఉన్న
By Medi Samrat Published on 12 Dec 2020 7:21 PM ISTకర్నాటకలోని కోలార్‌లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం సృష్టించారు ఉద్యోగులు. ఐఫోన్ తయారీ ప్లాంట్ లో ఉద్యోగుల విధ్వంసం జరిగింది. బెంగళూరుకు సమీపంలో కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఉన్న ప్లాంట్ లో వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఉద్యోగులు ప్లాంట్ పై దాడి చేశారు. ఈ ప్లాంట్ ను తైవాన్ కు చెందిన టెక్ దిక్కజం విస్ట్రన్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది.
ఈ ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో పని చేసేందుకు దాదాపు 2 వేల మంది ఉద్యోగులు ప్లాంటుకు వచ్చారు. జీతాలు ఇంకా చెల్లించలేదనే ఆగ్రహంతో ప్లాంట్ పై దాడి చేశారు. అసెంబ్లింగ్ యూనిట్లను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. సమాచారం అందుకున్న వెంటనే కోలార్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారులు, అదనపు బలగాలతో సహా ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు కారణమైన కనీసం 132 ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అద్దాలు, డోర్లను పగలగొట్టడం, కార్లను తలకిందులు చేయడం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కార్యాలయాలపై దాడి చేయడం వంటివి ఈ వీడియోల్లో ఉన్నాయి. 43 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రూ. 2,900 కోట్ల పెట్టుబడి పెడతామని, 10 వేల మందికి పైగా ఉపాధిని కల్పిస్తామనే ఒప్పందంతో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 43 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 6 కోట్ల రూపాయల విలువైన విస్ట్రాన్ కంపెనీ బస్సులు, కార్లను తగలబెట్టారు. జీతాలపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఉద్యోగులు దాడులకు పాల్పడడం తప్పని పోలీసులు చెప్పారు.