అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చికాగో శివారులో మూడేళ్ల చిన్నారి తుపాకీతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు తన తల్లిని కాల్చి చంపాడని పోలీసులు సోమవారం తెలిపారు. ఈ విషాదం శనివారం సాయంత్రం మిడ్ వెస్ట్రన్ నగరంలోని శివారు ప్రాంతమైన డాల్టన్‌లోని సూపర్ మార్కెట్ పార్కింగ్ స్థలంలో జరిగింది.
చిన్న పిల్లవాడు కారు వెనుక చైల్డ్ సీటులో ఉండగా.. అతని తల్లిదండ్రులు ముందు కూర్చున్నారు. ఇంతలో ఆ పిల్లాడి చేతికి తండ్రి పిస్టల్ దొరికింది. పిల్లవాడు కారు లోపల దానితో ఆడుకోవడం ప్రారంభించాడు.. ఆ సమయంలో పిల్లవాడు ట్రిగ్గర్‌ను లాగాడని స్థానిక పోలీసు చీఫ్ రాబర్ట్ కాలిన్స్ AFP కి చెప్పారు. అతని తల్లి 22 ఏళ్ల డేజా బెన్నెట్ కు మెడ వెనుక భాగంలో తూటా దూసుకువెళ్లింది. ఆమెను చికాగో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి భర్త చట్టబద్ధంగా తుపాకీని కలిగి ఉన్నాడా లేదా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని కాలిన్స్ చెప్పారు.
ప్రతి సంవత్సరం, యునైటెడ్ స్టేట్స్‌లోని వందలాది మంది పిల్లలు తుపాకీలను తమ చేతుల్లోకి తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదవశాత్తు కాల్చడం వంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటుంటాయి.