విద్యార్థినితో స‌హా ఉపాధ్యాయుడు ఆత్మ‌హ‌త్య‌

UP Teacher, His Minor Student Found Hanging In Forest. 40 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయుడు, అతనికి ఓ విద్యార్థినితో సంబంధం ఉన్నట్లు

By Medi Samrat
Published on : 21 Sept 2022 6:15 PM IST

విద్యార్థినితో స‌హా ఉపాధ్యాయుడు ఆత్మ‌హ‌త్య‌

షహరన్ పూర్(ఉత్తరప్రదేశ్) : 40 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయుడు, అతనికి ఓ విద్యార్థినితో సంబంధం ఉన్నట్లు కథనాలు వచ్చాయి. వారు ఒక అడవిలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయుడు, తొమ్మిదో తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక మంగళవారం అర్థరాత్రి అడవిలో ఉరివేసుకుని కనిపించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపిన్ తడా తెలిపారు.

ఉపాధ్యాయుడు తాను పనిచేస్తున్న పాఠశాలలోనే చదువుతున్న బాలికతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సెప్టెంబర్ 3 నుంచి వీరు కనిపించకుండా పోయారని తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు కిడ్నాప్‌ కు సంబంధించి ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి కోసం వెతకడం ప్రారంభించారు, చివరికి కనుగొనలేకపోయారని ఆయన చెప్పారు.

సాయంత్రం, ఆ ప్రాంతంలో దుర్వాసన వ‌స్తుంద‌న్న స‌మాచారంతో.. ఒక పోలీసు బృందం అడవికి వెళ్లింది. రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని పోలీసులు చెప్పారు. పదిరోజుల క్రితమే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతదేహాల స్థితిగతులను బట్టి తెలుస్తోంది. ఆ ప్రాంతం నుంచి బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని, అయితే ఎలాంటి సూసైడ్ నోట్‌ లభించలేదని అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించామని తెలిపారు.




Next Story