ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌లో మహిళపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. నిందితుడిని అన్నా అలియాస్ శుభం మోద్వాల్‌గా గుర్తించారు. అతను కొత్వాలి ప్రాంతంలో నివాసి. పబ్లిక్ టాయ్ లెట్ లో సౌకర్యాలను కూడా చూసుకుంటూ ఉండాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.
కొత్వాలి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సంయుక్త బృందం భూపియామావు క్రాసింగ్ సమీపంలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ (ప్రతాప్‌గఢ్ సిటీ) అభయ్ పాండే విలేకరులతో చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహిళ, అహ్మదాబాద్‌కు రైలు ఎక్కాల్సి ఉండడంతో శుక్రవారం రాత్రి తన భర్తతో కలిసి ప్రతాప్‌గఢ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో, తన భర్త టీ, అల్పాహారం తీసుకురావడానికి వెళ్లినప్పుడు, ఆమె పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్లగా.. అక్కడ అత్యాచారానికి గురైంది. మహిళ, ఆమె భర్త ఫిర్యాదు చేయడానికి వెంటనే కొత్వాలి పోలీసులను ఆశ్రయించారు. ఆమెను వైద్య పరీక్షల కోసం పంపారు.