వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విష‌యం తెలిసిన‌ మేనమామ ఏం చేశాడంటే.?

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక వ్యక్తి తన 22 ఏళ్ల మేనకోడలీని చంపేశాడు.

By Medi Samrat  Published on  23 Aug 2024 9:15 PM IST
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విష‌యం తెలిసిన‌ మేనమామ ఏం చేశాడంటే.?

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక వ్యక్తి తన 22 ఏళ్ల మేనకోడలీని చంపేశాడు. గతంలో నిందితుడు ఆమెతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు.. అయితే ఆమె ఇటీవల వేరొకరిని వివాహం చేసుకోవాలని అనుకోగా.. ఆమెను అతి దారుణంగా హత్య చేసాడు. నిందితుడు మణికాంత్ ద్వివేది మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పడేసి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె సెల్‌ఫోన్‌ను ఓ బస్సులో విసిరేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రక్షాబంధన్ సందర్భంగా మాన్సీ పాండే అనే యువతి సోమవారం ఇంటి నుండి బయటకు వెళ్ళింది. ఆమె తిరిగి రాకపోవడంతో, మాన్సీ పాండే తండ్రి రాంసాగర్ పాండే తన కుమార్తెను తీసుకెళ్లాడని ఆరోపిస్తూ మణికాంత్‌పై పోలీసు కేసు నమోదు చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు తన నేరాన్ని బయటపెట్టాడు. మాన్సీతో రెండేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడని జిల్లా పోలీసు చీఫ్ నీరజ్ కుమార్ జాదౌన్ తెలిపారు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉండడంతో ఆగ్రహించిన మణికాంత్ ఆమె గొంతు నులిమి చంపేశాడని పోలీసులు తెలిపారు. మాన్సీ పెళ్లి నవంబర్ 27న ఫిక్స్ అయింది. అలా జరగడం తనకు ఇష్టం లేదని, పెళ్లి చేసుకోవద్దని మణికాంత్‌ అడిగాడని.. అందుకు మాన్సీ నో చెప్పడంతో అతడు ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.

Next Story