మామిడి పండు కావాలని అడిగినందుకు 5 ఏళ్ల మేన‌కోడ‌లిని హ‌త్య చేసిన వ్య‌క్తి

UP man kills 5-year-old niece after she repeatedly asked for mango. భోజనం చేస్తున్న సమయంలో మామిడి పండు కావాలని పదే పదే అడిగినందుకు

By Medi Samrat  Published on  23 July 2022 3:04 PM IST
మామిడి పండు కావాలని అడిగినందుకు 5 ఏళ్ల మేన‌కోడ‌లిని హ‌త్య చేసిన వ్య‌క్తి

భోజనం చేస్తున్న సమయంలో మామిడి పండు కావాలని పదే పదే అడిగినందుకు 33 ఏళ్ల వ్యక్తి తన 5 ఏళ్ల మేనకోడలిని హత్య చేశాడు. ఈ ఘటన యూపీలోని షామ్లీలోని ఖేదా కుర్తాన్‌ గ్రామంలో చోటుచేసుకుంది. బాలిక మామిడిపండు కావాల‌ని మారం చేసినందుకు రెచ్చిపోయిన నిందితుడు.. మొదట రాడ్‌తో బాలిక తలపై మోదీ.. ఆపై గొంతు కోశాడు. దీంతో బాలిక‌కు తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచాడ‌ని పోలీసులు తెలిపారు.

కూలీ కూతురైన ఖైరు నిషా అనే ఐదేళ్ల బాలిక‌ మంగ‌ళ‌వారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. కంధ్లా ఎస్‌హెచ్ఓ శ్యామ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. "నిందితుడు బాలిక కోసం వెతకడానికి గ్రామస్థులతో స‌హా వెళ్ళాడు, కానీ పోలీసులు అతనిని అనుమానించిన వెంటనే పారిపోయాడని తెలిపారు.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణలో నిందితుడు ఉమర్దీన్ ఇంట్లో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడిని గురువారం రాత్రి అరెస్టు చేసి శుక్రవారం జైలుకు తరలించారు.

షామ్లీ ఏఎస్పీ ఓపీ సింగ్ మాట్లాడుతూ.. "గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నిందితుడు ఉమర్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద హ‌త్య‌కు ఉప‌యోగించిన కత్తి, ఇనుప రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

















Next Story