యూపీలో మరో ఘోరం.. మైనర్ బాలిక శవం రోజంతా..

UP Girl's Body Found Hanging Off Bridge, Killed In Fight With Family. ఉత్తర ప్రదేశ్‌లో మరో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలిక శవం

By Medi Samrat  Published on  22 July 2021 3:24 PM IST
యూపీలో మరో ఘోరం.. మైనర్ బాలిక శవం రోజంతా..

ఉత్తర ప్రదేశ్‌లో మరో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలిక శవం రోజంతా రైల్వే బ్రిడ్జికి వేలాడింది. డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారి గురించి తెలిసి షాక్ కు గురయ్యారు. ఆమె తాత, మామలు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలిక జీవనశైలి నచ్చక ఆమె తాత, మామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

17 ఏళ్ల మైనర్‌ బాలిక తన తల్లితో కలిసి ఇటీవలే డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మైనర్‌ బాలిక జీవనశైలి, ఆమె కుటుంబ నేపథ్యం తాతకు, మామలకు నచ్చలేదు. బాలికపై కోపం పెంచుకున్న ఆమె తాత రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలిక కిందపడటంతో గాయాలయ్యాలయ్యాయని, దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని తల్లికి చెప్పారు. మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది.

బాలిక చనిపోవడంతో మృతదేహన్ని డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. బ్రిడ్జి మీద నుంచి బాలికను కిందకు తోసేందుకు ప్రయత్నించారు. ఆమె కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆమె మృతదేహం అక్కడే వేలాడింది. అటు పక్కగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలిక మృతదేహం వేలాడుతుండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Next Story