ఫిరోజాబాద్‌కు చెందిన 18 ఏళ్ల బాలికపై ఆగ్రాలోని సికంద్రా ప్రాంతంలో కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగినప్పటికీ.. ఫిర్యాదును గురువారం నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు ఆరు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు నిందితుల్లో ఒకరైన 24 ఏళ్ల కృష్ణ బాఘేల్‌తో స్నేహం ఏర్పడింది. బాఘేల్ నిన్ను కలవాలని అమ్మాయిని ఎప్పుడూ కోరుతుండే వాడట.. అందుకు ఆమె అంగీకరించగా బాఘేల్ హేమంత్ కుమార్ ఎం స్నేహితుడితో వచ్చాడు. ఇద్దరూ ఆమెపై కారులో అత్యాచారం చేశారు. వారు తనతో బలవంతంగా బీరు తాగించారని, ఆమె నిరాకరించడంతో ఆమె తలను కారు డోర్‌కు కొట్టి, బలవంతంగా తన నోటిలో బీరు పెట్టారని కూడా ఆమె ఆరోపించింది.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని తన చెల్లెలికి చెప్పగా, కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఆ ఇద్దరు వ్యక్తులు దాడికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేశారని, ఈ సంఘటనను ఎవరితోనైనా చెప్పడానికి ప్రయత్నిస్తే దానిని వైరల్ చేస్తామని బెదిరించారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందని, అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిందని బాలిక సోదరుడు చెప్పాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈ ఘటన మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు అధికారి లఖన్ సింగ్ తెలిపారు. తదుపరి విచారణ కోసం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. IPC సెక్షన్ 376 D (గ్యాంగ్ రేప్) కింద FIR నమోదు చేయబడింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేశారు.