ఆరేళ్ళ బాలిక మిస్సింగ్.. ఎదురింటి లోని ట్రంక్ పెట్టెలో శవం
UP girl killed after sexual assault, body stuffed in trunk. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ పట్టణంలోని గురువారం ఉదయం ఇంటి నుండి తప్పిపోయిన
By Medi Samrat
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ పట్టణంలోని గురువారం ఉదయం ఇంటి నుండి తప్పిపోయిన ఆరేళ్ల బాలిక శనివారం ఉదయం మృతదేహమై పొరుగువారి ఇంట్లోని ట్రంకు పెట్టెలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఇంటి యజమానిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. హాపూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) సర్వేష్ మిశ్రా మాట్లాడుతూ, గురువారం నాడు అమ్మాయి కొన్ని వస్తువులను కొనుక్కోవడం కోసం తన ఇంటి నుండి బయటికి వచ్చిందని.. నిందితుడు అమ్జాద్ (38) ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నిందితుడు ఒక కార్మికుడని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆపై ఆమెను చంపాడని గుర్తించారు. ఘటన జరిగినప్పుడు అతని భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేరని మిశ్రా తెలిపారు.
అదే సమయంలో బాలిక కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించి, ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. శనివారం ఉదయం ఒక ఇంటి నుండి వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసు బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. ప్రధాన గేటుకు తాళం వేసి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వారు తాళం పగులగొట్టి, ఇంటిలో వెతకగా, ట్రంక్ పెట్టెలో ఉంచిన బాలిక మృతదేహాన్ని కనుగొన్నారని మిశ్రా చెప్పారు. నిందితుడిని హాపూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిలోకిపురం ప్రాంతంలో అరెస్టు చేశామని, అనంతరం నేరం అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. కార్మికుడు డ్రగ్స్ బానిస అని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు.