పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరికి హత్యకు గురయ్యాడు!
UP Farmer Murdered for Money. ఈ కాలంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక పెళ్లి చేసుకుని
By Medi Samrat
ఈ కాలంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక పెళ్లి చేసుకుని భార్యా బిడ్డలను పోషించడం ఎంతో కష్టతరంగా మారింది. అలాంటిది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పది పెళ్లిళ్లు చేసుకున్న ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణంగా హత్యకు గురైన ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
ఉత్తరప్రదేశ్ బరేలీలో జిల్లాకు చెందిన 52 సంవత్సరాల జగన్‌లాల్ యాదవ్ అనే రైతు 1990 నుంచి మొదలుకుని ఇప్పటివరకు 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఈ 10 మంది భార్యలలో ఐదుగురు చనిపోగా, మరో ముగ్గురు వేరే వారితో వెళ్ళిపోయారు. ప్రస్తుతం జగన్ లాల్ యాదవ్ ఇద్దరు భార్యలతో జీవనం సాగిస్తున్నారు. ఇందులో మరొక విషయం ఏమిటంటే పది పెళ్లిళ్లు చేసుకున్న జగన్ లాల్ కు సంతానం లేరు. జగన్ లాక్ తన భార్య మొదటి భర్తకు పుట్టిన సంతానంతో కలిసి నివసిస్తున్నారు.
ఈ విధంగా ఇద్దరు భార్యలతో కలిసి జీవనం సాగిస్తున్న జగన్ లాల్ బుధవారం ఊరికి దగ్గరలోని పంట పొలంలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.అయితే జగన్ లాల్ ను ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య గురించి భోజిపుర స్టేషన్ హౌస్ అధికారి ఈ కేసు గురించి మాట్లాడుతూ.. '' హతుడికి మేయిన్ రోడ్డు పక్కన స్థలం ఉంది. దానికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉండటం వల్ల అతనిని హత్య చేసి ఉంటారని భావించారు. ఒకేసారి 10 మందిని వివాహం చేసుకున్న తనకు పిల్లలు లేకపోవడంతో జగన్ లాల్ తండ్రి తన ఆస్తిని తన అన్న పేరుపై రాశాడు. ఈ తరుణంలోనే జగన్ లాల్ పంచాయతీలో గెలిచి కొంత భూమిని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ భూమి కోసమే తనను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.