ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో తమ కస్టమర్‌ల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో రెస్టారెంట్‌కు సీల్ వేశారు పోలీసులు. అంతేకాకుండా ఆ రెస్టారెంట్ యజమాని, అతని వ్యాపార భాగస్వామిని కూడా అరెస్టు చేశారు.
జైకా కేఫ్ & పిజ్జా కార్నర్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. యజమానులైన హస్నైన్, అయాన్ లు కస్టమర్‌లు అక్కడ భోజనం చేస్తున్నప్పుడు రహస్యంగా రికార్డ్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదులు అందాయి.
ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెస్టారెంట్‌లో కస్టమర్ల కోసం ప్రత్యేక క్యాబిన్‌లు ఉన్నాయని, నిందితులు రహస్యంగా వీడియోలను రికార్డ్ చేయడానికి క్యాబిన్ డోర్‌లకు రంధ్రాలు చేసి, తరువాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారని తేలింది. విచారణ తర్వాత, జైకా కేఫ్ & పిజ్జా కార్నర్ రెస్టారెంట్ యజమాని, అతని భాగస్వామిని భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత హస్నైన్, అయాన్‌లను కోర్టు ముందు హాజరుపరిచారు, వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.