దారుణం.. 8 రూపాయలు ఇస్తాన‌ని ఆశ చూపి ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి

బీహార్ రాష్ట్రంలో ఐదేళ్ల బాలుడితో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగు చూసింది.

By -  Medi Samrat
Published on : 22 Dec 2025 3:50 PM IST

దారుణం.. 8 రూపాయలు ఇస్తాన‌ని ఆశ చూపి ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి

బీహార్ రాష్ట్రంలో ఐదేళ్ల బాలుడితో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగు చూసింది. వెస్ట్ చంపార‌న్ ప్రాంతంం కాటయ్య పంచాయతీలోని 8వ వార్డు ఫుల్వారియా సారెలో ఓ యువ‌కుడు ఐదేళ్ల‌ బాలుడికి ఎనిమిది రూపాయ‌లు ఆశ చూపి అసహజ సంభోగానికి పాల్పడ్డ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. తండ్రి బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుప‌త్రికి తీసుకొళ్లాడు. అక్క‌డ వైద్యులు అంతర్గత రక్తస్రావం అనుమానంతో బాలుడిని బెట్టియా GMCH కి రిఫర్ చేశారు. మరోవైపు లారియా పోలీసులు వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం కాటయ్య పంచాయతీ ఫూల్వారియా గ్రామానికి చెందిన గౌరీశంకర్ సాహ్ కుమారుడు వినోద్ సాహ్(20) అదే గ్రామానికి చెందిన ఓ బాలుడికి రూ.8 ఇస్తానని మాయమాటలు చెప్పి సారెలోని తోటలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ బాలుడితో అసహజ సంభోగానికి పాల్పడ్డాడు. అనంతరం బాలుడిని ఇంటి దగ్గర వదిలేసి పరారయ్యాడు. బాలుడు ఏడుస్తూ ఇంటికి చేరుకోగా.. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. ఏడుస్తూ విష‌యం తండ్రికి చెప్పాడు. కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ అఫ్రోజ్ ఆలం ప్రథమ చికిత్స తర్వాత బెట్టియా GMCHకి రిఫర్ చేశారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ రమేష్‌కుమార్‌ శర్మ మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు తెలిపారు.

Next Story