Accident : రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువ‌కులు

చందానగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

By Medi Samrat
Published on : 24 July 2024 7:15 PM IST

Accident : రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువ‌కులు

హైద్రాబాద్ చందానగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చందానగర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న బాధితులు గొలుసు మనోజ్ (23), చిట్టిమల రాజు (26) ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. “రాజు వెనక కూర్చోగా మనోజ్ బైక్ నడుపుతున్నాడు. జీఎస్‌ఎం మాల్‌ నుంచి చందానగర్‌ వైపు రాంగ్‌ డైరెక్షన్‌లో వెళ్తున్న మనోజ్‌ ఎదురుగా వస్తున్న టీఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టాడు. ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందారు" అని చందానగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ రమేష్ తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Next Story