తీవ్ర విషాదం.. సాంబార్‌లో పడి చిన్నారి మృతి

Two-year-old child dies after falling in Sambar in Krishna district. కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి.. ప్రమాదవశాత్తు సాంబార్‌లో పడి మృతి చెందింది.

By అంజి  Published on  14 Feb 2022 11:53 AM GMT
తీవ్ర విషాదం.. సాంబార్‌లో పడి చిన్నారి మృతి

కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి.. ప్రమాదవశాత్తు సాంబార్‌లో పడి మృతి చెందింది. ఆదివారం నాడు బంధువుల ఇంట్లో జరుగుతున్న పుట్టిన రోజు వేడుకలకు పాపను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఈ ఘటన దళితవాడలో జరిగింది. పుట్టిన రోజు కార్యక్రమం జరుగుతున్న సమయంలో తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇదే సమయంలో కుర్చీలో కూర్చుకున్న పాప.. ప్రమాదవశాత్తు.. పక్కనే వేడిగా ఉన్న సాంబార్‌ గిన్నెలో పడింది.

దీంతో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ పాప చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాప మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే పాప కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా పాప అంత్యక్రియలు జరిగాయి. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it