భర్తలను వదిలేసి ఇంట్లో పనిచేసే తాపీ మేస్త్రీలతో పారిపోయిన ఇద్దరు మహిళలు..!
Two women fall in love with masons working at home, elope with them abandoning husbands. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి
By Medi Samrat Published on 23 Dec 2021 12:23 PM GMT
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మేస్త్రీలతో ప్రేమలో పడిన ఇద్దరు మహిళలు తమ భర్తలను విడిచిపెట్టి వారితో పారిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు తాపీ మేస్త్రీలు మహిళల ఇంట్లో పనిచేస్తున్నట్లు సమాచారం. మహిళల ఇంట్లో తాపీ మేస్త్రీలు పనిచేస్తూ వారితో స్నేహంగా మెలిగి ప్రేమలో పడ్డారు. ఇద్దరు మహిళలు ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులతో కలిసి పారిపోయారు. మహిళల అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హౌరా పరిధిలోని నిశ్చిందా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
తాపీ మేస్త్రీలు ముందుగా మహిళల స్వగ్రామమైన ముర్షిదాబాద్‌కు తీసుకెళ్లారు. ఒక రోజు తర్వాత.. రెండు జంటలు ముంబైకి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారిలో ఒకరి కాల్ లిస్ట్‌ను తనిఖీ చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణలో భాగంగా మేస్త్రీల ఇంటికి వెళ్లగా.. వారు అక్కడ లేరు. కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలు, తాపీ మేస్త్రీల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాన్ని ముంబైకి పంపే పనిలో ఉంది. వారిలో ఒక మహిళ తన 6 ఏళ్ల కుమారుడిని కూడా తన వెంట తీసుకెళ్లిందని.. ఇంట్లో నుంచి బయటకు రాగానే ఇద్దరు మహిళలు ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేశారని పోలీసులు తెలిపారు.