అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఇద్ద‌రు తెలుగు యువ‌కులు అక్క‌డే అనుమానాస్పదంగా మరణించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.

By అంజి  Published on  16 Jan 2024 12:15 PM IST
students, AndhraPradesh, Telangana, America

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఇద్ద‌రు తెలుగు యువ‌కులు అక్క‌డే అనుమానాస్పదంగా మరణించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. అమెరికాలో ఈ ఇద్దరు యువకులు అద్దెకు ఉంటున్న ఇంటిలోనే విగ‌తజీవులుగా ప‌డి ఉండ‌టం చూసిన స్థానికులు వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు వెంకన్న కుమారుడు గట్టు దినేశ్ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. పదహారు రోజుల క్రితం వెంకన్న తన కుటుంబ సభ్యులతో కలిసి ఎయిర్ పోర్టుకు వెళ్లి సంతోషంగా కొడుకుకు సెండాఫ్ ఇచ్చాడు. ఇంతలోనే దినేశ్ చని పోయాడం టూ అమెరికా పోలీసుల నుంచి సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే దినేశ్‌తో పాటు అదే రూములో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మ‌రో విద్యార్ధి కూడా మ‌ర‌ణించాడ‌ని శ్రీకాకుళంలోని వారి బంధువుల‌కు కూడా పోలీసులు స‌మాచారం అందించారు. ఈ ఇద్ద‌రు నిద్రలో ఉండ‌గానే క‌న్నుమూశార‌ని పోలీసులు ప్రాధమిక ద‌ర్యాప్తులో వెల్ల‌డించారు. పోస్ట్ మార్ట‌ం అనంత‌ర‌మే వీరిద్దరి మ‌ర‌ణానికి గల కార‌ణాలను వెల్ల‌డిస్తామ‌ని అధికారులు చెప్పారు. అంతే కాకుండా త్వ‌ర‌లోనే వీరి మృత‌దేహాల‌ను భారత్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన వారి పిల్లలు మృతి చెందడంతో రెండు కుటుంబాలు విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story