పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని.!

దేశరాజధాని ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది. సెలూన్ లో ఇద్దరిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు.

By Medi Samrat  Published on  10 Feb 2024 8:16 AM IST
పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని.!

దేశరాజధాని ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది. సెలూన్ లో ఇద్దరిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సెలూన్ లో ఆ బాధిత వ్యక్తి వద్దు.. వద్దంటూ వేడుకుంటున్నా కూడా వినకుండా తల మీద తుపాకీ పెట్టి మరీ కాల్పులు జరిపారు.

నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలోని సెలూన్‌లో ఇద్దరు వ్యక్తులను ఫిబ్రవరి 9న కాల్చి చంపారు. 30 ఏళ్ల వయసు ఉన్న.. సోను, ఆశిష్‌లను ఇతర కస్టమర్‌లు, సెలూన్ వర్కర్ల ముందే చాలాసార్లు కాల్చి చంపారు. ఈ సంఘటన కు సంబంధించిన CCTV ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బాధితుల్లో ఒకరు దాడి చేసిన వారిని వేడుకుంటూ ఉన్నాడు. సోను తలపై ఒక్కసారి కాల్పులు జరపగా, ఆశిష్ తలపై మూడు, ఛాతీలో ఒక బుల్లెట్ గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

వ్యక్తిగత శత్రుత్వమే ఈ హత్యలకు కారణమని అనుమానిస్తున్నప్పటికీ.. గ్యాంగ్‌వార్‌కు దారితీసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఘటన అనంతరం ఇద్దరు దుండగులు పారిపోయారని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే, ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సెలూన్ సిబ్బంది భయంతో వణికిపోయారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆశిష్‌పై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని, బాధితులిద్దరూ నజఫ్‌గఢ్ ప్రాంతంలోని నాగ్లీ సక్రవతి నివాసితులని పోలీసులు తెలిపారు.

Next Story