ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు వ్యక్తులు జనక్‌పురి ప్రాంతంలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని జనక్‌పురి ఫ్లైఓవర్ దగ్గర తనను కలవాలని ఓ వ్యక్తి బాలికను పిలిచాడు. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. ఆమె బంధువు సూచించిన వ్యక్తిని సంప్రదించి అతనిని కలవడానికి వెళ్ళింది. ఏప్రిల్ 3న ఆమె అక్కడికి చేరుకోగానే ఆ వ్యక్తి ఆమెను కారులో కూర్చోమని కోరాడు. ఆ కారులో అప్పటికే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు.
నిందితులు ఆమెకు మత్తుమందులు, డ్రగ్స్ కలిపిన పానీయం ఇచ్చారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు, వారు ఆమెపై కారులో అత్యాచారం చేశారు. నిందితులిద్దరూ బాలికను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత బాలిక హెల్ప్‌లైన్ నంబర్ 181కి ఫోన్ చేసి అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. మొదట్లో ఆమె ఫిర్యాదును పోలీసులు నమోదు చేయలేదు. ఏప్రిల్ 4న, బాధితురాలు మహిళా హెల్ప్‌లైన్‌ను సంప్రదించడంత జనక్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. తనకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిందితులిద్దరూ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.