త‌ల్లితో రిలేష‌న్‌లో ఉన్న వ్య‌క్తి.. దూరంగా ఉండ‌మ‌ని హెచ్చ‌రించిన కొడుకులు.. అయినా విన‌క‌పోవ‌డంతో..

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఓ వ్యక్తిని హతమార్చారు.

By Medi Samrat  Published on  29 Jan 2025 5:36 PM IST
త‌ల్లితో రిలేష‌న్‌లో ఉన్న వ్య‌క్తి.. దూరంగా ఉండ‌మ‌ని హెచ్చ‌రించిన కొడుకులు.. అయినా విన‌క‌పోవ‌డంతో..

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఓ వ్యక్తిని హతమార్చారు. తమ తల్లితో సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు బాధితుడి పేగులను గాల్లోకి ఎగరేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

బాధితుడి కుమారుడు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం సంజయ్‌ (27), జయేష్‌ ఠాకూర్‌ (23) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి తల్లితో 45 ఏళ్ల రతన్‌జీ ఠాకూర్‌ కు సంబంధం ఉందని సంజయ్, జయేష్ లకు తెలిసింది. ఆమె ఓ వితంతువు, 15 సంవత్సరాల క్రితం భర్తను పోగొట్టుకుంది. తల్లి సంబంధం గురించి తెలుసుకున్న కొడుకులు కోపంతో ఊగిపోయారు. తమ తండ్రిని అగౌరవపరిచిందని, కుటుంబానికి ‘అవమానం’ తెచ్చిందని నిందితులు భావించారు. సంజయ్, జయేష్ ఇంతకు ముందు కూడా రతన్ జీ ఠాకూర్‌తో ఘర్షణకు దిగారు.

తమ తల్లికి దూరంగా ఉండమని ఆ వ్యక్తిని పదేపదే హెచ్చరించారు. ఈ విషయంలో కుల సంఘాల పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే, సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదివారం నాడు సంజయ్, జయేష్ కత్తి, రాడ్‌తో రతన్‌జీ, అతని సహచరుడు జికుజీ పర్మార్‌పై దాడి చేశారు.

కొంతమంది అడ్డుకోడానికి ప్రయత్నించినా అన్నదమ్ములు వారి మాట వినలేదు. రతన్ జీపై అతి కిరాతకంగా దాడి చేసి బైక్‌పై పారిపోయారు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, అప్పటికే చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఇద్దరి మొబైల్ ఫోన్ లొకేషన్‌లను ట్రాక్ చేసి తర్వాతి రోజున అరెస్టు చేశారు.

Next Story