సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాళ్లోకెళితే.. కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెం వద్ద ఎన్‌హెచ్-65లో ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను బానోత్ తోప్యా (45), సునీత (38)గా గుర్తించారు. సీసీ ఫుటేజీని పరిశీలించి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొండాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.