స్విమ్మింగ్ పూల్‌లో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం

ఢిల్లీలోని నరేలాలోని లాంపూర్‌లోని ఎంకే స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు తొమ్మిదేళ్ల బాలికలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది.

By Medi Samrat
Published on : 13 Aug 2025 11:24 AM IST

స్విమ్మింగ్ పూల్‌లో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం

ఢిల్లీలోని నరేలాలోని లాంపూర్‌లోని ఎంకే స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు తొమ్మిదేళ్ల బాలికలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నేరేల పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్విమ్మింగ్ పూల్ కాంట్రాక్టర్ అనిల్, కేర్‌టేకర్ మునీల్‌లను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల విచార‌ణ‌కు ముందు aa దిండు కవర్లు, బెడ్‌షీట్లు, అభ్యంతరకర వస్తువులు, డీవీఆర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో నిందితులు ఇతర అమ్మాయిలపై కూడా ఇలాంటి అఘాయిత్యాల‌కు పాల్పడ్డారా అనే విష‌య‌పై కూడా పోలీసులు వివ‌రాలు రాబ‌ట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్విమ్మింగ్ పూల్‌కు ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో నివసించే మైనర్ బాలికలిద్దరూ ఆగస్టు 5న బస్సులో నరేలాలోని ఈ స్విమ్మింగ్ పూల్ వద్దకు ఈత కొట్టేందుకు వచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇంతకు ముందు కూడా మైనర్లిద్దరూ ఒకసారి ఇక్కడికి వచ్చారు. అమ్మాయిలిద్దరినీ కాంట్రాక్టర్‌ అనిల్‌ పట్టుకుని ఆవరణలోని ఓ గదిలోకి తీసుకెళ్లి త‌లుపులు మూసేశాడు. అనంతరం ఇద్దరిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కేర్‌టేకర్ మునీల్ కూడా ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు. ఆపై ఇద్దరినీ చంపేస్తానని బెదిరించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. నిందితులు ఈ నేరానికి పాల్పడినప్పుడు ఆ సమయంలో స్విమ్మింగ్ పూల్ లో ఎవరూ లేరు.

సమాచారం ప్రకారం.. స్విమ్మింగ్ పూల్‌ ఇంకా అధికారికంగా ఉపయోగం కోసం తెరవలేదు.. అయినప్పటికీ ప్రజలు తరచుగా ఎటువంటి రుసుము లేదా అధికారిక అనుమతి లేకుండా స్నానం చేయడానికి అక్కడకు వస్తారు.

ఘటన జరిగిన రోజు స్విమ్మింగ్ పూల్ గేట్లు తెరిచి ఉండడంతో బాలికలిద్దరూ స్నానం చేఉయ‌డానికి అక్కడికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. అదే సమయంలో నిందితులిద్దరూ అక్కడికి వచ్చి ఈ నేరానికి పాల్పడ్డారు.

ఔటర్-నార్త్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ హరేశ్వర్ వి స్వామి మాట్లాడుతూ.. ఆగస్టు 8న ఒక మహిళ నరేలా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆగస్టు 5న లాంపూర్‌లోని ఎంకె స్విమ్మింగ్ పూల్ వద్ద తన తొమ్మిదేళ్ల కుమార్తె, మరో తొమ్మిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పారు. ఆగస్ట్ 9న మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 70 (2) (గ్యాంగ్ రేప్), 127 (నిర్బంధించడం), 351 (నేరపూరిత బెదిరింపు), పోక్సో చట్టంలోని సెక్షన్లు 6 మరియు 10 కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 83 కింద బాధిత బాలికల వాంగ్మూలాలను నమోదు చేశారు.

నిందితులను పట్టుకునేందుకు డిప్యూటీ కమిషనర్‌.. ఏసీపీ నరేలా రాకేష్‌కుమార్‌, ఎస్‌హెచ్‌వో నరేలా ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రసింగ్‌ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. రహస్య సమాచారం ఆధారంగా నిందితులు అనిల్‌కుమార్‌, మునీల్‌కుమార్‌లను అరెస్టు చేశారు. నిందితుడు అనిల్ కుమార్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా వాసి. మ‌రో నిందితుడు మునీల్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ నివాసి.

ఆగస్టు 5న ఈ ఘ‌ట‌న‌ జరిగిన తర్వా త బాధిత బాలిక ఆగస్టు 7న పొరుగున ఉండే అత్త ఇంటికి వెళ్లింది. ఈ మొత్తం ఘటనను బాలిక తన అత్తకు చెప్పింది. ఆమె అమ్మాయి తల్లికి విష‌యం చెప్పింది. ఆ తర్వాత ఆగస్ట్ 8న పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలి తల్లి ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని పోలీసులకు అందించింది.

Next Story