శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం.. ఇద్దరు మృతి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఊహించితిని విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది

By Medi Samrat  Published on  19 Sept 2024 6:15 PM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం.. ఇద్దరు మృతి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఊహించితిని విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు మరణించారు. గోవా నుంచి వచ్చిన ప్రయాణికుడు నితిషా, జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికురాలు సకీనా అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరినీ ఎయిర్‌పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారని అధికారులు తెలిపారు.

ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించగానే కుప్ప కూలిపోయారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story