న్యూడ్‌ వీడియోతో మహిళను వేధిస్తున్న ఇద్ద‌రు అరెస్ట్‌

Two arrested for harassing woman with nude video. మహిళ న్యూడ్‌ వీడియోతో వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను

By Medi Samrat  Published on  19 Aug 2022 6:24 PM IST
న్యూడ్‌ వీడియోతో మహిళను వేధిస్తున్న ఇద్ద‌రు అరెస్ట్‌

మహిళ న్యూడ్‌ వీడియోతో వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం మచిలీపట్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజమండ్రికి చెందిన ఓ మహిళ తన వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్‌ వ్యాపారి హన్సకుమార్ వ‌ద్ద‌ కొంత నగదు అప్పుగా తీసుకోవాలని అనుకుంది. దీన్ని అదనుగా భావించిన‌ హన్స కుమార్.. న్యూడ్‌ వీడియో కాల్‌ చేస్తే డబ్బులు అప్పుగా ఇస్తానని చెప్పాడు. దీంతో ఆ మహిళ తప్పని పరిస్థితుల్లో న్యూడ్‌ వీడియో కాల్ చేసింది. దీన్ని స్క్రీన్‌ రికార్డు చేశాడు హన్సకుమార్‌.

అక్కడితో ఆగకుండా విజయవాడ కానూరులోని తన బంధువు చందుకు షేర్‌ చేశాడు. అతను ఆ వీడియోని పోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టి బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు. దీంతో బాధిత మహిళ వారి వేధింపులను భరించలేక మచిలీపట్నం దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరినీ అరెస్ట్‌ చేసినట్టు దిశ డీఎస్పీ రాజీవ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు.

దిశ పోలీసులు మహిళ ఫిర్యాదును స్వీకరించి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.. వారి దగ్గర ఉన్న ఫోన్స్, ల్యాప్ టాప్, ఐపాడ్ స్వాధీనం చేసుకున్నట్లు దిశ డీఎస్పీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఎవరైనా న్యూడ్ కాల్ చేయమని వేధిస్తే.. వెంటనే దిశ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుంటామని రాజీవ్ కుమార్ చెప్పారు.


Next Story