దారుణం.. మహిళ గొంతు కోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ.. రాత్రి రమ్మంటే రాలేదని

TRS MLA PA who cut woman's throat.. Incident in Hyderabad

By అంజి  Published on  19 Sept 2022 11:45 AM IST
దారుణం.. మహిళ గొంతు కోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ.. రాత్రి రమ్మంటే రాలేదని

హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత సహాయకుడు (పిఎ) విజయసింహ కిరాతకానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్య రాత్రి బేగంపేటలోని బిఎస్ మక్తాలో ఒక వివాహిత ఇంటికి వెళ్లి తనతో పాటు రావాలని వేధింపులకు గురిచేశాడు. సదరు మహిళ నిరాకరించడంతో విజయ సింహా బీరు బాటిల్‌తో కొట్టి మహిళ గొంతు కోశాడు. ఆ తర్వాత బాధితురాలి చేయి విరిచి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

తెలిసిన వివరాల ప్రకారం.. ఓ ఈవెంట్ కోసం పని చేస్తున్నప్పుడు మహిళ పీఏ విజయసింహ కంటపడింది. అప్పటి నుంచి విజయసింహా ఆమెకు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నాడ. ఆమె కాల్‌ లిఫ్ట్‌ చేయకపోతే చంపేస్తానని బెదిరించాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు పీఏగా ఉన్న విజయసింహాపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆమె భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. "నన్ను విడిచిపెట్టి తనతో ఉండమని ఎమ్మెల్యే పీఏ నా భార్యను బెదిరించాడు" అని అతను ఆరోపించాడు. పీఏ విజయసింహ నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పాడు.

Next Story