Troubled by girlfriend's infidelity, a young man hanged himself. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య
By Medi Samrat Published on 10 Dec 2021 11:18 AM GMT
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి నమ్మకద్రోహం వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సంచలన విషయాలు తెలిపాడు. ఈ మేరకు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన తర్వాత తన ప్రియురాలిని వేధించకూడదని.. ప్రియురాలి ఫోటో వెనుక వ్రాసి..బెడ్ షీట్‌తో ఉరివేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఆర్మీ ఉద్యోగం నిమిత్తం పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మృతి చెందిన విద్యార్థి జలాన్‌కు చెందినవాడు. కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్‌లోని పి బ్లాక్‌లోని హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. మృతుడి గదిలో గ్లాస్ పైన ఒక అమ్మాయి ఫోటోను పోలీసులు కనుగొన్నారు. ఇందులో శివమ్ అమ్మాయి చేసిన ద్రోహం గురించి రాశాడు. నువ్వు చేసింది మంచి పని కాదు.. మోసం చేయాల్సి వచ్చినప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు అని రాశాడు. నా మరణం తర్వాత ఆమెను వేధించవద్దని పేర్కొన్నాడు. మృతుడి సూసైడ్ నోట్, ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలల క్రితమే విద్యార్థి హాస్టల్‌కు వచ్చినట్లు సమాచారం. అతను చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని.. కోచింగ్ తర్వాత శివమ్ తన గదిలోనే ఉండేవాడని హాస్టల్‌లో ఉన్న ఇతర విద్యార్థులు పోలీసులకు తెలిపారు. అతనికి స్నేహితులు కూడా లేరు. ఎవరితో పెద్దగా కలవడని తెలిపారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.