భ‌ర్త‌ను కొట్టి భార్య‌పై సామూహిక అత్యాచారం

Tribal woman dragged into bushes, gang-raped in Jharkhand, 7 held. జార్ఖండ్‌లోని బోరియో జిల్లా జెట్కే కుమ్రార్ జోరీలో 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.

By M.S.R  Published on  30 April 2023 5:25 PM IST
భ‌ర్త‌ను కొట్టి భార్య‌పై సామూహిక అత్యాచారం

జార్ఖండ్‌లోని బోరియో జిల్లా జెట్కే కుమ్రార్ జోరీలో 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. సదరు యువతి తన భర్తతో కలిసి జాతర నుండి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారం జరిగింది. ఐదు నుండి ఆరుగురు వ్యక్తులు తమపై దాడి చేసి, తన భార్యను సమీపంలోని పొదల్లోకి బలవంతంగా లాక్కుని వెళ్లారని, అక్కడ వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని భర్త పోలీసులకు సమాచారం అందించాడు. ఆమె భర్త అత్యాచారాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించగా నిందితులు అతనిపై కూడా దాడి చేశాడు. భర్త గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశాడు.

ఒంటి మీద బట్టలు లేకుండా మహిళ ఎలాగోలా తప్పించుకుని తన గ్రామానికి చేరుకుంది. ఈ సంఘటనను గ్రామస్థులు బయటకు పొక్కనివ్వకుండా చేశారు. ఎట్టకేలకు బోరియో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం బోరియో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సాహిబ్‌గంజ్‌ సదర్‌ ఆస్పత్రికి తరలించారు.భర్త ఫిర్యాదు నమోదు చేయడంతో, పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.


Next Story